Telangana Election 2023 Results: బర్రెలక్క సంచలనం... కొల్లాపూర్ బ్యాలెట్ ఓటింగ్ లో ముందంజ!

By Sambi ReddyFirst Published Dec 3, 2023, 9:31 AM IST
Highlights

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తెలంగణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాల దిశగా అడుగులు వేస్తుంది. అనూహ్యంగా ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ప్రధాన అభ్యర్థుల కంటే ముందు ఉన్నట్లు సమాచారం. 
 

సోషల్ మీడియా సెలబ్రిటీ బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారారు. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక పేదింటి యువతి అయిన బర్రెలక్కకు యువతతో పాటు కొన్ని వర్గాల నుండి గట్టి మద్దతు లభించింది. మాజీ ఐపీఎస్ అధికారిక జేడీ లక్ష్మీనారాయణ ఆమె కోసం కొల్లాపూర్ లో స్వయంగా ప్రచారం చేశారు. 

బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిరుద్యోగ యువతకు న్యాయం జరగలేదు అనేది ఆమె ఆరోపణ. ఇదే నినాదంగా ఎన్నికల బరిలో దిగింది. సొంత మేనిఫెస్టో విడుదల చేసి ఆకర్షించింది. ఆమెకు ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. కొల్లాపూర్ ఓటింగ్ ని బర్రెలక్క ప్రభావితం చేయనుందనే ఊహాగానాల మధ్య, గ్రౌండ్ రియాలిటీ కూడా అలానే ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఇది నిజంగా ఉహించని పరిణామం. 

ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన యువతి అయిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క 10000 ఓట్లు తెచ్చుకున్నా ఆమె విజయం సాధించినట్లే లెక్క అనేది పరిశీలకుల వాదన. అలాగే ఆమెకు పడే ఓట్లు ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఆమె గెలిచినా ఆశ్చర్యం లేదని కొందరి వాదన. 

కర్నె శిరీష సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆమె సొంతూరిలో గేదెలు కాస్తూ వీడియోలు చేసేది. అలా ఆమెకు బర్రెలక్కగా పాపులారిటీ వచ్చింది. ఎన్నికల్లో నిలబడ్డ బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం విశేషం. 

click me!