ఒకే ఒక్కడు: బీజేపీ రెండో జాబితా విడుదల

By narsimha lode  |  First Published Oct 27, 2023, 2:19 PM IST

బీజేపీ  రెండో జాబితాను ఇవాళ ప్రకటించింది. ఒక్క అభ్యర్ధికే  బీజేపీ రెండో జాబితాలో చోటు దక్కింది.  
 


హైదరాబాద్: ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో  బీజేపీ రెండో జాబితా  శుక్రవారంనాడు విడుదలైంది.  మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు  ఏపీ మిథున్ రెడ్డికి  బీజేపీ టిక్కెట్టు కేటాయించింది.  మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  మిథున్ రెడ్డి  బరిలోకి దిగనున్నారు. 

ఈ నెల  22న  బీజేపీ  తొలి జాబితాను ప్రకటించింది.  52 మందితో  తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తొలి జాబితాలో  చోటు కల్పించింది బీజేపీ. ఇవాళ రెండో జాబితాను  బీజేపీ విడుదల చేసింది. 

Latest Videos

undefined

గతంలో  మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి  ఏపీ జితేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అయితే మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  జితేందర్ రెడ్డి తనయుడు ఏపీ మిథున్ రెడ్డిని బరిలోకి దింపనున్నారు జితేందర్ రెడ్డి. 

also read:మాఫియా చేతిలో తెలంగాణ బందీ: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన కేఎస్ రత్నం

టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ లలో  గతంలో జితేందర్ రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.   బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలపై  సోషల్ మీడియాలో ఆయన గతంలో చేసిన ట్వీట్లు  చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి నివాసంలో బీజేపీ  నేతల సమావేశం కూడ  అప్పట్లో కలకలం రేపాయి.  పార్టీని బలోపేతం చేసే విషయమై  తాము చర్చించినట్టుగా  జితేందర్ రెడ్డి  అప్పట్లో ప్రకటించారు. 

మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.మరోసారి శ్రీనివాస్ గౌడ్ బరిలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్ధిగా  ఏపీ మిథున్ రెడ్డి  పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధిని ఫైనల్ చేయలేదు.తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని  బీజేపీ పట్టుదలగా ఉంది.  గత కొంత కాలంగా  క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంపై  కేంద్రీకరించింది. దక్షిణాదిలో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో తెలంగాణపై  బీజేపీ ఫోకస్ పెంచింది.గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ  మెరుగైన ఫలితాలను సాధించింది.  ఈ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి.  దీంతో  సునీల్ భన్సల్ నేృత్వత్వంలోని టీమ్ తెలంగాణలో  కొంత కాలంగా  పనిచేస్తుంది. 
 


 

click me!