కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం : నాకు మరో రోజు సమయం ఇవ్వండి .. అసెంబ్లీ సెక్రటరీని కోరిన కేటీఆర్

By Siva Kodati  |  First Published Dec 9, 2023, 5:14 PM IST

నూతనంగా కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక సర్జరీ చేయించుకుని వుండటంతో ఆయన, కేటీఆర్‌లు ప్రమాణ స్వీకారానికి రాలేదు .


నూతనంగా కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సభను డిసెంబర్ 14కి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా.. తర్వాత మంత్రులు , ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కార్యక్రమానికి బీజేపీ శాసనసభ్యులు దూరంగా వుంటున్నట్లు ముందే ప్రకటించారు. మరోవైపు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక సర్జరీ చేయించుకుని వుండటంతో ఆయన, కేటీఆర్‌లు ప్రమాణ స్వీకారానికి రాలేదు .

దీనిపై కే. తారక రామారావు స్పందిస్తూ ప్రమాణ స్వీకారానికి తమకు మరో రోజు సమయం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని కోరారు. తన తండ్రి కేసీఆర్ వెంట ఆసుపత్రిలో వున్నందున తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి హాజరుకాలేనని వెల్లడించారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యం కుదటపడిన అనంతరం ఎమ్మెల్యేగా మరో రోజు ప్రమాణ స్వీకారినికి అనుమతి ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షనేతగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Latest Videos

undefined

Also Read: కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. వాకర్ సాయంతో నడిపించిన డాక్టర్లు.. (వీడియో)

బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరిలు దీనిని బలపరిచారు. అలాగే మిగిలిన కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కూడా చంద్రశేఖర్ రావుకు అప్పగిస్తూ బీఆర్ఎస్ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 

click me!