నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం: నిరవధిక వాయిదా

By narsimha lodeFirst Published Oct 13, 2020, 3:08 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో నాలుగు బిల్లులను ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.
 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నాలుగు బిల్లులను ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.

స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టాలకు సంబంధించిన బిల్లు, అగ్రికల్చర్ ల్యాండ్  సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు, క్రిమినల్ ప్రోసీజడర్ సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు.

జీహెచ్ఎంసీ చట్టానికి ఐదు సవరణలను ప్రతిపాదిస్తూ తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో బీసీల రిజర్వేషన్ బిల్లును సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రస్తావించారు. 

also read:హైద్రాబాద్‌కు గొప్ప చరిత్ర: కేటీఆర్

బలహీనవర్గాలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉన్నందున వారికి కూడ సమాన ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ బిల్లులను రేపు తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
 

click me!