రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించే శకటాల ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాలకు ఈ సారి అవకాశం దక్కలేదు
హైదరాబాద్: దేశ రాజధాని Dlehi లో జరిగే Republic వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించింది. వాటిలో అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలు మాత్రమే ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అనుమతి లభించలేదు.
గత ఏడాది కూడా రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని నిర్వహించే Tableau ప్రదర్శనలో Telangana రాష్ట్ర శకటానికి అవకాశం దక్కలేదు. ఈ ఏడాదితో తెలంగాణ శకటానికి పేరేడ్ లో అవకాశం దక్కకపోవడం వరుసగా ఇది ఆరో ఏడాది. గత ఏడాది కరోనాను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం తన శకటాన్ని ప్రదర్శనకు పంపలేదని అధికారులు అప్పట్లో ప్రకటించారు.
గత ఏడాది Andhra pradesh ప్రభుత్వం తన శకటాన్ని రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శనకు అవకాశం దక్కించుకొంది. లేపాక్షి ఆలయం శకటాన్ని గత ఏడాది రిపబ్లిక్ పరేడ్ లో ఏపీ ప్రభుత్వం పంపింది.2015లో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ శకటం రిపబ్లిక్ పరేడ్ లో అవకాశం దక్కించుకొంది.2020లో సమ్మక్క సారలమ్మ దేవతల శకటం ప్రదర్శనకు అనుమతి దక్కింది.2015, 2020, 2021లలో ఏపీ రాష్ట్రాలకు చెందిన మూడు శకటాలు రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శనకు అనుమతి దక్కింది. ఈ ఏడాది మాత్రం ఏపీ శకటానికి అనుమతి రాలేదు.ఇదిలా ఉంటే శకటాల ఎంపిక విషయం నిపుణుల కమిటీ మాత్రమే నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఈ విషయంలో కేంద్రం పాత్ర లేదని చెబుతుంది.
రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహంచే శకటాల ప్రదర్శనలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల శకటాలను తిరస్కరించారు. దీంతో ఆయా రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. అయితే ఈ శకటాల ఎంపికలో నిపుణుల కమిటీదే నిర్ణయమని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి మొత్తం 56 ప్రతిపాదనలు అందాయి. అయితే ఇందులో 21 మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. సమయం తక్కువగా ఉన్నందున ఎక్కువ ప్రతిపాదనలు తిరస్కరించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన శకటాలను అనుమతించాలని ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రం శకటాన్ని తిరస్కరించడంపై కేరళ కూడ కేంద్రంపై విమర్శలు చేసింది.
కళ, సంస్కృతి, సంగీతం, వాస్తు శిల్పం, కొరియోగ్రఫీ మొదలైన రంగాల్లోని ప్రముఖులతో కలిగిన నిపుణుల కమిటీ రిపబ్లిక్ డే పరేడ్ లో శకటాలను అనుమతించాలా వద్దా అని నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రదర్శనకు అనుమతి లభిస్తే ఇదే ప్రాతిపదికన అనుమతి దక్కిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఇదే తరహలోనే 2018, 2021లలో కేరళ శకటానికి అనుమతి ఇచ్చినట్టుగా అధికారులు చెప్పారు. మరో వైపు 2016, 2017, 2019,2020,2021లో తమిళనాడు శకటానికి ఆమోదం లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.2016, 2017, 2019, 2021లలో బెంగాల్ శకటాలు రిపబ్లిక్ పరేడ్ కోసం ఆమోదం పొందాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.