గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు:

By rajesh yFirst Published 11, Sep 2018, 8:08 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. కేసీఆర్ ను ఆపద్ధర్మ సీఎం పీఠం నుంచి తొలగించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ లు గవర్నర్ ను కలిసి తెలంగాణలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేసీఆర్ ను ఆపద్ధర్మ స్థానం నుంచి తొలగించాలని కోరారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. కేసీఆర్ ను ఆపద్ధర్మ సీఎం పీఠం నుంచి తొలగించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ లు గవర్నర్ ను కలిసి తెలంగాణలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేసీఆర్ ను ఆపద్ధర్మ స్థానం నుంచి తొలగించాలని కోరారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఫిర్యాదు చేశారు. 

 తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నరసింహన్ కు సూచించారు.  ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని తొలగిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని కోరారు. 20 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని గవర్నర్  కు తెలిపారు. అయితే గవర్నర్ తమ అభ్యర్థనపై స్పందించలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST