Telangana MLAs: 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 59 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్టులు పేర్కొన్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వెల్లడించాయి.
Telangana MLAs-criminal charges: 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 59 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్టులు పేర్కొన్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని శనివారం నివేదిక వెల్లడించింది. అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 58 శాతం మంది అంటే 59 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. 119 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 118 మంది నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను ప్రచురించాయి. ప్రస్తుత అసెంబ్లీలో సికింద్రాబాద్ నియోజకవర్గం ఒకటి ఖాళీగా ఉంది.
undefined
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లు, ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల ఆధారంగా విశ్లేషణ జరుగుతుంది. 118 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 72 మంది (61 శాతం) సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు పెట్టారనీ, 46 (39 శాతం) మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెట్టిన విషయాలను నివేదిక పేర్కొంది. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నానికి సంబంధించిన కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించారని పేర్కొంది. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్-376 కింద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదు చేసినట్లు నివేదిక హైలైట్ చేసింది.
అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 59 (58 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు (86 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు (67 శాతం), బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు. అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 38 (38 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు (29 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు (50 శాతం), బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.