15యేళ్లకే దొంగతనాలు, 19యేళ్లకు ముగ్గురి హత్యలు.. నిజామాబాద్ ఘటనలో వెలుగులోని షాకింగ్ విషయాలు..

Published : Dec 13, 2021, 09:58 AM IST
15యేళ్లకే దొంగతనాలు, 19యేళ్లకు ముగ్గురి హత్యలు.. నిజామాబాద్ ఘటనలో వెలుగులోని షాకింగ్ విషయాలు..

సారాంశం

విచారణలో నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో నివసిస్తున్న 19 యేళ్ల గంధం శ్రీకాంత్ ని హంతకుడిగా గుర్తించారు. 15యేళ్ల వయసు నుంచే దొంగతనాలకు అలవాటు పడిన శ్రీకాంత్ అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన రోజు కూడా మద్యం మత్తులో నగదు కోసం ఆ షెడ్డు వద్దకు వెళ్లాడు. తొలుత బయట మంచం మీద నిద్రిస్తున్న సునీల్ తల మీద సుత్తితో దాడి చేసి చంపేశాడు. అక్కడే షెడ్డులో మద్యం సీసా కనిపించడంతో మళ్లీ తాగాడు.

డిచ్ పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో గత మంగళవారం అర్థరాత్రి ముగ్గురిని కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు 19 యేళ్ల యువకుడని, మద్యం మత్తులో నగదు కోసం murder చేశాడని నిజామాబాద్ సీపీ కార్తికేయ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. Dichpallyలోని ప్రధాన రహదారి పక్క ఉన్న హార్వెస్టర్ షెడ్డులో హర్పాల్ సింగ్, జోగిందర్ సింగ్, సునీత్ దారుణ హత్యకు గురికాగా.. డిచ్ పల్లి పోలీసులు ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు.

విచారణలో నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో నివసిస్తున్న 19 యేళ్ల గంధం శ్రీకాంత్ ని హంతకుడిగా గుర్తించారు. 15యేళ్ల వయసు నుంచే దొంగతనాలకు అలవాటు పడిన శ్రీకాంత్ అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన రోజు కూడా మద్యం మత్తులో నగదు కోసం ఆ షెడ్డు వద్దకు వెళ్లాడు. తొలుత బయట మంచం మీద నిద్రిస్తున్న సునీల్ తల మీద సుత్తితో దాడి చేసి చంపేశాడు. అక్కడే షెడ్డులో మద్యం సీసా కనిపించడంతో మళ్లీ తాగాడు.

తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజుల క్రితం చివరి కాల్.. ఆ తర్వాతం ఏం జరిగింది..?

తర్వాత హర్పాల్ సింగ్, జోగిందర్ సింగ్ ల మీద వరుసగా సుత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం వారి సెల్ ఫోన్లు, రూ.2,800 నగదు అపహరించుకుని వెళ్లాడు. మృతులు ముగ్గురూ మద్యం తాగి గాఢనిద్రలో ఉండడంతో శ్రీకాంత్ కు ఎక్కడా ప్రతిఘటన ఎదురు కాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. నగదు కోసం వచ్చిన వ్యక్తి హత్యలు ఎందుకు చేశాడనేది అనుమానంగా ఉంది. అయితే దొంగతనం సమయంలో అలికిడికి మెలుకుంటే.. తాను పట్టు బడతానని భయపడి ముందుగానే చంపేశాడా? లేక మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక చంపుకుంటూ వెళ్లాడా? అనేది తేలాల్సి ఉంది

సెల్ ఫోన్ లో సిమ్ వేసి...
దొంగతనం చేసిన సెల్ ఫోన్ లను శ్రీకాంత్ తన వెంటే ఉంచుకున్నాడు. దొంగతనం తరువాత ఆ సెల్ ఫోన్లలో సిమ్ లను తీసేసిన నిందితుడు.. తర్వాత అందులో ఒక ఫోన్ లో తన సిమ్ కార్డ్ వేశాడు. అయితే కొత్త టెక్నాలజీతో హంతకుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులకు దీంతో ఓ క్లూ దొరికినట్టైంది. హత్యకు గురైన వారి సెల్ లో వేరొకరి సిమ్ వేసినట్లు పోలీసులకు సాంకేతిక ఆధారం లభించడంతో.. లొకేషన్ ఆరా తీసి నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో నిందితుడిని పట్టుకున్నారు. దర్యాప్తులో తానే హత్యలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. 

అతని నుంచి మృతుల సెల్ ఫోన్లు, కొంత నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018లో ఓ దొంగతనం కేసులో అరెస్టయిన శ్రీకాంత్ ను పోలీసులు అప్పట్లో బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. నిందితుడి కుటుంబసభ్యుల వివరాలు వెల్లడి కాలేదు. అతడు నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్