తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్.. వారం రోజుల క్రితం చివరి కాల్.. ఆ తర్వాతం ఏం జరిగింది..?

By Sumanth KanukulaFirst Published Dec 13, 2021, 9:30 AM IST
Highlights

తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కనిపించకుండా (Army jawan missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్ (Punjab) సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్.. విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారం రోజులుగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కనిపించకుండా (Army jawan missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్ (Punjab) సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్.. విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారం రోజులుగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన  సాయికిరణ్ రెడ్డి 6 నెలల క్రితం సైన్యంలో చేరారు. పంజాబ్ సరిహద్దులో ఫరీద్‌కోట సైనికుడిగా పనిచేస్తున్నారు. మూడు వారాల క్రితం సెలవుపై స్వగ్రామం వచ్చారు. 

20 రోజుల సెలవులు ఇవ్వడంతో నవంబర్ 16న స్వగ్రామానికి వచ్చిన సాయికిరణ్ రెడ్డి (Sai Kiran Reddy).. సెలవులు ముగిసిన వెంటనే డిసెంబర్ 5న మధ్యాహ్నం తన గ్రామం నుంచి పంజాబ్ బయలుదేరారు. కుటుంబ సభ్యులతో చివరిసారిగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అదే రోజు రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన మొదలైంది. అతని ఆచూకీ తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

దీంతో వారు పంజాబ్‌ ఫరీద్‌కోటలోని సైనికాధికారులను సాయికిరణ్ రెడ్డి తల్లిదండ్రులు సంప్రదించారు. అయితే  విధుల్లో చేరలేదని సైనికాధికారులు చెప్పడంతో.. వారిలో టెన్షన్‌ మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే వారు చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఢిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడ కేసు నమోదు చేసినట్టుగా చేర్యాల పోలీసులు తెలిపారు. తమ కొడుకు ఆచూకీ తెలుసుకోవడం కోసం సహకరించాలని సాయి కిరణ్ తల్లిదండ్రులు పలువురు ప్రజాప్రతినిధులను కలిశారు.

ఆర్మీ అధికారులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ సాయంతో సీసీటీవీ ఫుటేజ్‌ చెక్ చేశారు. అందులో డిసెంబర్ 6వ తేదీ రాత్రి సాయికిరణ్ రెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లినట్టుగా తేలింది. మరోవైపు సాయికిరణ్‌తో పాటు రైలులో ప్రయాణం చేసిన మరో జావాన్ భటిండాలో చివరిసారిగా అతన్ని చూశారని.. ఆర్మీ అధికారులు సాయి కిరణ్ కుటుంబానికి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఇక, పంజాబ్ పోలీసులు సాయి కిరణ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 

click me!