గణతంత్ర వేడుకల్లో తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి..

By Rajesh Karampoori  |  First Published Jan 27, 2024, 3:30 AM IST

గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా అపశ్రుతి చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలవడంతో విషాదం చోటుచేసుకుంది.  ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..? 


గణతంత్ర దినోత్సవం వేళ ఉమ్మడి మెదక్ లోని ములుగులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా అపశ్రుతి చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలవడంతో విషాదం చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకెళ్లే.. ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని పలువురు భావించారు. ఈ క్రమంలో జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు జెండా పోల్ కు పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25)‌లు అనే యువకులు విద్యుతాఘాతానికి గురై.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోపారు. ఈ ఘటనలో గాయపడిన చక్రి (25)ని ఆస్పత్రికి తరలించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుతఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మంత్రి సీతక్క పరామర్శ 

Latest Videos

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మృతుల బంధువులను పరామర్శించి సంతాపం తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేలు అందజేశారు. విద్యుత్ శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చూస్తానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి సీతక్క బాధిత కుటుంబాలకు హమీ ఇచ్చారు.

click me!