తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రేపే: పలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా

By narsimha lode  |  First Published Jun 27, 2022, 8:27 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇందరారెడ్డి ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి విడుదల చేయనున్నారు. 


హైదరాబాద్:Telangana ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి Sabitha Indra Reddy ఈ నెల 28న విడుదల చేయనున్నారు. Intermediate ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇటీవలనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో 9,07,393 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇంటర్ పలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.

 4.80 లక్షల మంది  ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. అదే సంఖ్యలో సెకండియర్ స్డూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ రాశారు.  కేసీఆర్ సర్కారు.  ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 6 నుండి 24, 2022 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు.  ఇంటర్ పరీక్ష ఫలితాలను https://tsbie.gov.in , https://results.cgg.gov.inhttps://examresults.ts.nic.in  ఈ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
 

Latest Videos

click me!