TS SSC Results 2022 : నేడు తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు.. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ?

By team teluguFirst Published Jun 30, 2022, 8:36 AM IST
Highlights

నేడు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి ఉదయం 11.30 గంటలకు అధికారంగా ఫలితాలు వెల్లడికానున్నాయి. వీటిని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. 

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న బోర్డు ప‌రీక్ష ఫ‌లితాలు నేడు విడుద‌ల కానున్నాయి. గురువారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప‌దో తర‌గ‌తి (10th class) ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ఎస్ఎస్ఎస్ విద్యార్థులు ((TS SSC Students) తమ ఫలితాలను TSBSE (Telangana State Board Of Secondary Education) అధికారిక వెబ్ సెట్ లో చెక్ చేసుకోవచ్చు. మార్కుల షీట్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

సీఎం కేసీఆర్ స‌ర్కారుపై తెలంగాణ ప్ర‌జ‌ల అసంతృప్తి.. : అనురాగ్ ఠాకూర్

ఫలితాలు వెల్లడించిన తరువాత విద్యార్థులు ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ఇత‌ర వెబ్ సైట్ల‌లోనూ చూసుకోవ‌చ్చు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేటి ఉద‌యం మీడియా సమావేశంలో నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా TS SSS Results 2022 ప్రకటిస్తారు. SSC పరీక్ష ఫలితాలను పరీశీలించడానికి విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ను బోర్డు వెబ్ సైట్లలో ఉప‌యోగించాల్సి ఉంటుంది. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: మోడీ టూర్‌కి భారీ భద్రత, 5 వేల మంది పోలీసులతో పహారా

తెలంగాణ SSC పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మే 23 నుండి జూన్ 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించారు. ప‌రీక్ష‌లు ముగిసిన నెల రోజుల్లోపే ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇటీవ‌లే పరీక్ష పేప‌ర్ల మూల్యాంక‌నం కూడా పూర్తి అయ్యింది. కాగా తెలంగాణ విద్యాశాఖ‌, తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంట‌ర్మీడియట్ ఎడ్యుకేష‌న్ (TSBIE)  ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకెండియ‌ర్ ఫ‌లితాల‌ను ప్రక‌టించాయి. 

Kanhaiya Lal Murder : 24 గంటల్లోనే కోటి రూపాయల విరాళాలు.. బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ కు భారీ స్పందన...

తెలంగాణ SSC బోర్డు ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించని విద్యార్థులకు విద్యా సంవ‌త్స‌రం కోల్పోకుండా ఉండేందుకు తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు స‌ప్లమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నుంది. ఈ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన కొన్ని రోజుల్లోపే స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కాగా గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా విద్యార్థులంద‌రినీ ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టించారు. కాబ‌ట్టి స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. ఈ ఫ‌లితాల‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను విద్యాశాఖ మంత్రి, అధికారులు మీడియా స‌మావేశంలో వెల్ల‌డించ‌నున్నారు. అయితే తెలంగాణలో 10వ తరగతి పరీక్ష‌ల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.
 

click me!