సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలి: రాహుల్‌ను కోరిన టీ కాంగ్రెస్ నేతలు

First Published Jun 20, 2018, 1:27 PM IST
Highlights

రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ


న్యూఢిల్లీ: సీనియర్ నాయకుల సూచనలు, సలహలను పరిగణనలోకి తీసుకోవాలని  ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. 

బుధవారం నాడు తెలంగాణకు చెందిన  పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు  న్యూఢిల్లీలో  ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు.  రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని బలోపేతం చేసే విషయమై  పార్టీ నేతలతో  రాహుల్ చర్చించారు. 

తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు రాహుల్ ను కోరారు.  పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు గాను  సుమారు 40 మంది పార్టీ ముఖ్యుల జాబితాను తయారు చేసి రాహుల్ గాంధీకి అందించారు. 

సీనియర్ నేతలతో చర్చించాలని  పార్టీ నేతలు  రాహుల్ ను కోరారు. త్వరలోనే పార్టీ నేతలతో సమావేశం ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు  అభిప్రాయపడుతున్నారు.  పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై  కూడ చర్చించనున్నారు. రాహుల్‌తో సమావేశమైన తర్వాత పార్టీ మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డికె అరుణ,  పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్కలు మీడియాతో మాట్లాడా

click me!