సమ్మె చేస్తే డిస్మిస్సా, సచివాలయానికి రాని మిమ్మల్ని ఏం చేయాలి..?: డా.కె.లక్ష్మణ్

By Nagaraju penumalaFirst Published Oct 11, 2019, 5:32 PM IST
Highlights

టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదంటూ హెచ్చరించారు. అక్రమ అరెస్ట్‌లతో లోబర్చుకోవటం అలవాటైపోయిందంటూ మండిపడ్డారు. ఒక్క రోజు సమ్మె చేస్తేనే ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తారా అంటూ నిలదీశారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదంటూ హెచ్చరించారు. 

అక్రమ అరెస్ట్‌లతో లోబర్చుకోవటం అలవాటైపోయిందంటూ మండిపడ్డారు. ఒక్క రోజు సమ్మె చేస్తేనే ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తారా అంటూ నిలదీశారు. అయితే కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రారని అలాంటప్పుడు ఆయనను ఏం చేయాలంటూ కేసీఆర్ నిలదీశారు. 

రూ.80వేల కోట్లకు పైగా ఆస్తులున్న ఆర్టీసీని కేవలం 3వేల కోట్ల అప్పులు చూపి నిర్వీర్యం చేయటం చాలా దౌర్భాగ్యమన్నారు. సకలజనుల సమ్మె తరహాలో బీజేపీ గొడుగు కింద మరో ఉద్యమం రాబోతుందని విమర్శించారు. 

కేసీఆర్ ఆగడాలను అరికట్టే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని డా.కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి బీజేపీ సిద్ధంగా ఉందని డా.లక్ష్మణ్ ప్రకటించారు. భవిష్యత్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు ఎలాంటి ఉద్యమ కార్యచరణ ప్రకటించినా అందుకు తాము మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. 

 

click me!