సీఐపై హుజూర్‌నగర్ ఉప ఎన్నిక దెబ్బ

By narsimha lodeFirst Published Oct 11, 2019, 4:54 PM IST
Highlights

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక  ఓ సీఐపై సస్పెన్షన్ వేటుకు కారణమైంది. ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న సీఐపై ఎన్నికల సంఘం వేటు వేసింది. 

హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన జరిగే హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సైదానాయక్‌పై ఎన్నికల కమిషన్ వేటేసింది.

జోగుళాంబ గద్వాల జిల్లా టీసీఆర్‌సీలో సీఐగా సైదానాయక్ పనిచేస్తున్నాడు.అయితే ఎన్నికలను పురస్కరించుకొని సైదానాయక్  సెలవు పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో ఎన్నికల సంఘం సైదానాయక్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ నెల 6వ తేదీ నుండి 10 వ తేదీ వరకు హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం  కల్మెట్టితండాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఎన్నికల సంఘం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొంది.

సీఐ సైదానాయక్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలను కాంగ్రెస్,  టీఆర్ఎస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ స్థానం నుండి వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

ఈ దఫా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి బరిలో ఉన్నారు. రెండోసారి ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ సైదిరెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో సైదిరెడ్డి ఓటమి పాలయ్యాడు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్  తిరస్కరించారు. నామినేషన్ పత్రాలను సక్రమంగా నింపని కారణంగా  శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. 
 

click me!