టీనేజ్ ప్రేమ.. అతని కోసం ఆమె త్యాగం.. ఆమె లేదనే బాధతో...!

Published : Aug 16, 2021, 08:53 AM ISTUpdated : Aug 16, 2021, 08:57 AM IST
టీనేజ్ ప్రేమ.. అతని కోసం ఆమె త్యాగం.. ఆమె లేదనే బాధతో...!

సారాంశం

వారి పెళ్లికి బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో.. తాను చనిపోతానంటూ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని.. బాలికకుపంపించాడు. నిజమనుకొని.. బాలిక ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

వారిద్దరూ టీనేజర్లే. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. చివరకు ఒకరి కోసం మరొకరు ప్రాణత్యాగం చేసుకున్నారు. అతను చనిపోతాడనే భ్రమలో ఆ బాలిక ప్రాణాలు కోల్పోగా...  ఆమె మరణానికి తానే కారణమంటూ అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటుచేసుకోగా.. ఈ  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 కామేపల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల యవకుడు.. అదే గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే..  వారి పెళ్లికి బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో.. తాను చనిపోతానంటూ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని.. బాలికకుపంపించాడు. నిజమనుకొని.. బాలిక ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

అయితే..  యువకుడు మాత్రం.. ఎలాంటి అఘాయిత్యం చేసుకోలేదు. కాగా.. బాలిక తల్లిందడ్రులు పోలీసులను కూడా ఆశ్రయించకపోవడంతో అందరూ ఈవిషయాన్ని మర్చిపోయారు.  చాలా రోజుల తర్వాత.. యువకుడు బాలికకు పంపిన సెల్ఫీ వీడియో బయట పడింది. దీంతో.. బాలిక తల్లిదండ్రులు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు.

పంచాయతీ పెద్దలు యువకుడి తల్లిదండ్రలకు రూ.13లక్షలు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చారు. ఈ విషయం కాస్త.. యువకుడికి ఆలస్యంగా తెలియడంతో.. మనస్తాపానికి గురై.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu