తెలంగాణ: భారీగా పడిపోయిన కేసులు.. 24 గంటల్లో 245 మందికి పాజిటివ్, కేవలం ఒకే ఒక్క మరణం

Siva Kodati |  
Published : Aug 15, 2021, 09:23 PM IST
తెలంగాణ: భారీగా పడిపోయిన కేసులు.. 24 గంటల్లో 245 మందికి పాజిటివ్, కేవలం ఒకే ఒక్క మరణం

సారాంశం

తెలంగాణలో కొత్తగా 245 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒక్కరు మృతి చెందారు. 582 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 7,268 యాక్టివ్‌ కేసులు వున్నాయి  

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 245 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,52,380కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,842కి చేరింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ నుంచి 582 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,41,270కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 52, జగిత్యాల 7, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 30, ఖమ్మం 7, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 9, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 4, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 17, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 10, సిరిసిల్ల 4, రంగారెడ్డి 16, సిద్దిపేట 5, సంగారెడ్డి 1, సూర్యాపేట 8, వికారాబాద్ 2, వనపర్తి 1, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 15, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu