మహబూబ్ నగర్: ఒకే గదిలో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం... నిండు గర్భిణి మృతి

Arun Kumar P   | Asianet News
Published : Oct 26, 2021, 10:45 AM ISTUpdated : Oct 26, 2021, 10:47 AM IST
మహబూబ్ నగర్: ఒకే గదిలో వివాహిత,  యువకుడు ఆత్మహత్యాయత్నం... నిండు గర్భిణి మృతి

సారాంశం

ఏడు నెలల గర్భవతి అయిన వివాహిత, ఓ  యువకుడు ఒకే గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. యువకుడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 

మహబూబ్ నగర్: ఒకే గదిలో వివాహితో పాటు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరూ ఉరేసుకోగా వివాహిత ప్రాణాలు కోల్పోయింది. యువకుడు మాత్రం హాస్పిటల్ లో చికిత్ప పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది.  

వివరాల్లోకి వెళితే... mahabub nagar district లోని గోపన్ పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు ఎక్లాపూర్ గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్లక్రితం వివాహమైంది. అయితే పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగలేదు. దీంతో భార్య అంగీకారంతోనే ఆమె చెల్లి అక్షిత(25) ను పెళ్లాడాడు ఆంజనేయులు. వీరికి మూడేళ్ల కొడుకు వుండగా ప్రస్తుతం అక్షిత ఏడు నెలల గర్భిణి. 

అయితే కారణమేంటో తేలీదు కానీ సోమవారం అక్షిత అదే గ్రామానికి చెందిన మధు అనే యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరూ ఒకే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిని గుర్తించిన కుటుంబసభ్యులు కాపాడి హాస్పిటల్ కు తరలిస్తుండగా అక్షిత మరణించింది. 

read more మద్యం తాగి వేధింపులు.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..!

అయితే యువకుడి పరిస్థితి కూడా విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే వుందని...మెరుగైన చికిత్స అందించి కాపాడే ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

మృతురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహితతో కలిసి యువకుడు ఒకే గదిలో ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ