
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముస్తాబాద్ చౌరస్తాలో ఇంటర్ చదివే యువతిని శేఖర్ అనే వ్యక్తి ఒక ఇంట్లోకి ఒంటరిగా తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రతయ్నించాడు. దీంతో భయపడిన ఆ యువతి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది.
ఆ యువతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి శేఖర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లైంగిక దాడికి ప్రయత్నించిన శేఖర్ స్థానికంగా ఉన్న మల్లిపర్సప్ హైస్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఏడుస్తూ వచ్చిన వీడియో, పోలీసుల వివరణ వీడియోలో ఉన్నాయి చూడండి.