ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. తెలంగాణ మొత్తం నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

By Siva KodatiFirst Published Jun 5, 2021, 2:40 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రెండు రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రెండు రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. టెక్నికల్ సమస్యలను పరిష్కరించేందుకు ఐటీ నిపుణులు చర్యలు తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read:ధరణి పోర్టల్‌లో సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలి: కేసీఆర్

మరోవైపు ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు వాట్సాప్, ఈమెయిల్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదులను 9133089444 వాట్సాప్ నెంబర్‌కు దానితో పాటు వెబ్‌సైట్‌కు తెలపవచ్చు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీసీఎల్, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులను సభ్యులుగా నియమించారని తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. 
 

click me!