కరోనా : 20 రోజుల వ్యవథిలో తండ్రీ, కొడుకు మృతి !

Published : Jun 05, 2021, 01:40 PM IST
కరోనా : 20 రోజుల వ్యవథిలో తండ్రీ, కొడుకు మృతి !

సారాంశం

జగిత్యాల జిల్లా,ధర్మపురి మండలం కోసునూర్ పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 20 రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. 

జగిత్యాల జిల్లా,ధర్మపురి మండలం కోసునూర్ పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 20 రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. 

గత నెల 15న  ఉట్కూరి హన్మంతరెడ్డి (75) కరోనా సోకి మృతి చెందాడు. ఆ తరువాత కరోనాబారిన పడిన హన్మంతరెడ్డి కొడుకు గంగారెడ్డి (38) హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నాడు. 

శనివారం నాడు కరోనా తీవ్రం కావడంతో హన్మంతరెడ్డి కొడుకు గంగారెడ్డి (38) మృతి చెందాడు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన గంగారెడ్డి కొడుకు తండ్రికి కరోనా సోకడంతో గతనెల 9న స్వగ్రామానికి వచ్చాడు. 

ఆస్పత్రిలో తండ్రితో పాటు ఉంటూ సేవలు చేయడంతో గంగారెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ గంగారెడ్డి ఈ రోజు మృతి చెందాడు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే