సెప్టెంబర్ 6న టీమ్ లీజ్ ఆధ్వర్యంలో టెక్ & హెచ్ఆర్ సదస్సు

By narsimha lodeFirst Published Sep 2, 2019, 9:24 PM IST
Highlights

ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు అన్న అంశంపై ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ హోటల్ దసపల్లాలో సదస్సు నిర్వహించనుంది. ఉద్యోగుల జీవిత చక్రంలో నియామకం, ఆన్ బోర్డింగ్ మరియు శిక్షణ, పరిహారం, ప్రయోజనాలు, నిష్క్రమణ తదితర అంశాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం సాయపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు

ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు అన్న అంశంపై ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ హోటల్ దసపల్లాలో సదస్సు నిర్వహించనుంది.

ఉద్యోగుల జీవిత చక్రంలో నియామకం, ఆన్ బోర్డింగ్ మరియు శిక్షణ, పరిహారం, ప్రయోజనాలు, నిష్క్రమణ తదితర అంశాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం సాయపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అలాగే మానవ వనరులు, కమ్యూనికేషన్, సమ్మతి, ఉద్యోగుల కేంద్రీకృత సమాచారం తదితర అంశాలపైనా హెచ్ ఆర్ విభాగం ప్రాధాన్యత వహిస్తుందన్నారు. ఈ సదస్సుకు పారిశ్రామిక ప్రముఖలు హాజరవ్వనున్నారు.

దీనిలో భాగంగా మానవ వనరుల రంగంలో టెక్నాలజీ ప్రాతపై గ్లోబల్ టాలెంట్ లీడర్ శ్రీకాంత్ అరిమాణిత్య, గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్ అజయ్ భక్షీ విలువైన సూచనలు, సలహాలు అందించనున్నారు.

అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీహెచ్ఆర్వో వెంకటేశ్ పాలభట్ల, మెకనీస్ సాఫ్ట్‌వేర్ సీనియర్ హెచ్ ఆర్ డైరెక్టర్ నేహా చోప్రా కుమార్, మోడల్ ఎన్ సీనియర్ హెచ్ ఆర్ డైరెక్టర్ రాజలక్ష్మీ శివానంద్, హెచ్ఎస్‌బీసీ డేటా అనలిటిక్స్ గ్లోబల్ హెడ్ కిరణ్ సముద్రాల, జీవీకే బయో డైరెక్టర్ ఐతా లక్ష్మీపతి తదితర ప్రముఖులు విలువైన సలహాలు ఇవ్వనున్నారని టీమ్ లీజ్ ప్రతినిధులు తెలిపారు.

ఈ సంస్ధ ప్రస్తుతం భారత్‌లో సుమారు 3,500 కంపెనీలకు హెచ్ ఆర్ నియామకాలు చేపడుతోంది. ఫార్ట్యూన్ ఇండియాలో సైతం టీమ్ లీజ్ సంస్థ స్థానం పొందడమే కాకుండా ఎన్ఎస్ఈ మరియు బీఎస్ఈలో లిస్ట్ అయ్యింది. 17 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 17 లక్షల మందికి ఉపాధిని చూపించింది. 

click me!