ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు

Published : Mar 09, 2017, 12:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు

సారాంశం

ఈ నెల 19 న రిపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశం

రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదారబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.  

 

ఈ నెల 19 న ఈ స్థానాలకు మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

 

టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి  బ్యాలెట్‌ పేపర్లో ఫోటోలు తారుమారైన నేపథ్యంలో వివాదం చెలరేగింది.

 

మూడో నంబర్లో ఉన్న టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి, తొమ్మిదో నెంబర్లో ఉన్న స్వతంత్ర అభ్యర్థి లక్ష్మయ్య ఫొటోలు తారుమారయ్యాయి.

 

దీన్ని గుర్తించిన అభ్యర్థి మాణిక్‌రెడ్డి పోలింగ్‌ రద్దు చేయాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు.

 

ఈ విషయంపై దర్యాప్తు చేసిన అనంతరం బ్యాలెట్‌ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడం నిజమేనని నిర్దారించిన భన్వర్ లాల్ ఈసీ కి నివేదిక పంపారు.

 

దీనిపై వెంటనే స్పందించిన ఈసీ ఎన్నికలను రద్దు చేసి  ఈనెల 19న రీపోలింగ్‌ నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu