ఉపాధ్యాయుడు దారుణ హత్య

By telugu team  |  First Published Feb 10, 2020, 9:21 AM IST

. ఆయన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటికి చేరుకున్నారు. చిన్ని రామకృష్ణ గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని భార్యపై కూడా దుండగులు దాడి చేయడం గమనార్హం


ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన  ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకివెళితే... ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన్న రామకృష్ణ(35) భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నాడు.

Also Read నమ్మించి తీసికెళ్లి ఐదుగురు మిత్రులతో కలిసి యువతిపై గ్యాంగ్ రేప్...

Latest Videos

కాగా... ఆయన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటికి చేరుకున్నారు. చిన్ని రామకృష్ణ గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని భార్యపై కూడా దుండగులు దాడి చేయడం గమనార్హం. కాగా.. ఉపాధ్యాయుడి హత్యకు భూ వివాదమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!