టీఆర్ఎస్‌లోకి ఎల్. రమణ: కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ

Published : Jul 08, 2021, 12:03 PM ISTUpdated : Jul 08, 2021, 12:48 PM IST
టీఆర్ఎస్‌లోకి ఎల్. రమణ: కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ

సారాంశం

తెలంగాణలో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా తమ రాజకీయ భవిష్యత్తును చూసుకొంటున్నారు.  టీడీపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. 


హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. రమణ టీఆర్ఎస్ లో చేరనున్నారు. టీఆర్ఎస్ లో చేరాలని  రమణను  గులాబీ నేతలు ఆహ్వానించారు.   కొంతకాలంగా టీఆర్ఎస్ లో చేరాలని రమణను ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా జగిత్యాల ఎమ్మెల్యే కూడ ఈ విషయమై రమణతో చర్చించారు.  

అధికారికంగా టీఆర్ఎస్ లో ఎప్పుడూ చేరాలనేది కార్యకర్తలతో చర్చిస్తానని ఎల్. రమణ చెప్పారు. కేసీఆర్ తో భేటి అనంతరం పూర్తి వివరాలు  వెల్లడిస్తానన్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్.రమణను  టీఆర్ఎస్ అభ్యర్ధిగా నిలబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. 
 

 

 

also read:కారెక్కేందుకు ఎల్. రమణ పెట్టిన డిమాండ్ ఇదే: వెయిట్ అండ్ సీ గేమ్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ స్థానం నుండి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. కరీంనగర్ ఎంపీ స్థానం నుండి  కూడ ఆయన విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ  తెలంగాణ టీడీపీ కన్వీనర్ గా  రమణ పనిచేశారు. తెలగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడ  రమణ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

రెండు దఫాలుగా ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను పురస్కరించుకొని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎల్. రమణను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు. 

PREV
click me!

Recommended Stories

ఆ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు.? కొండ‌గ‌ట్టు పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని ఎందుక‌న్నారు
Deputy CM Pawan Kalyan Visits Kondagattu Anjaneya Swamy Temple at Telangana | Asianet News Telugu