టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం.. షాక్ లో పార్టీ నేతలు

Published : Sep 25, 2018, 09:50 AM IST
టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం.. షాక్ లో పార్టీ నేతలు

సారాంశం

 ఆయన ఆకస్మిక మరణం.. పార్టీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఆకారపు ముకుందం(67) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణం.. పార్టీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్తను తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి ముకుందం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 

ఈసందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ... పార్టీ అభివృద్ధికి ముకుందం శక్తి వంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుమారుడు ఆకారపు శ్రీనివాస్‌ను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ముకుందం కుమారుడు శ్రీనివాస్‌ను పోలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్‌లో పరామర్శించారు.
 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం