కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు అనే యువకుడు గల్ఫ్ కు వెళ్లి అదృశ్యమయ్యాడు. రాజును గల్ఫ్ కు తీసుకెళ్లిన ఏజంట్ తమను మోసం చేశాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి: Kama Reddy జిల్లాకు చెందిన యువకుడు Gulf లో అదృశ్యమయ్యాడు.ఈ విషయమై బాధిత కుటటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశాడు.ఉపాధి కోసం నెల రోజుల క్రితం రాజు అనే యువకుడు గల్ఫ్ కు వెళ్లాడు. అయితే వారం రోజులుగా రాజు కుటుంబ సభ్యులతో కాంటాక్టులో లేకుండా పోయాడు.
కామారెడ్డి జిల్లాలోని Kesanpally గ్రామానికి చెందిన ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. వారం రోజులుగా రాజు ఫోన్ పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. Raju కు గల్ఫ్ లో ఉపాధి చూపుతామని నమ్మించి తీసుకెళ్లిన ఏజంట్ మోసం చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
undefined
రాజు Phone పనిచేయడం లేదని తాము ఏజంట్ ను సంప్రదిస్తే రాజు జైలులో ఉన్నాడని ఏజంట్ తమకు సమాచారం ఇచ్చాడని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు.
ఉపాధి కోసం గల్ప్ వెళ్లిన రాజును ఏజంటే మాట్లాడిస్తేనే మాట్లాడేవారని చెప్పారు. గల్ఫ్ వెళలిన తర్వాత తమ కుటుంబంతో రెండు దఫాలు మాట్లాడినట్టుగా బాధిత కుటుంబం చెబుతుంది.
రాజు ఆచూకీ లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం కూడా లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. రాజు ఏ కంపెనీలో చేరాడో ఆ కంపెనీకి చెందిన ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరినా కూడా ఫోన్ నెంబర్లు ఇవ్వడం లేదని బాధిత కుటుంబం చెబుతుంది.
రాజును గల్ఫ్ కు పంపిన ఏజంట్ ప మాత్రం జైలులో రాజు ఉన్నాడని చెబుతున్నారన్నారు. అయితే రాజు జైలుకు ఎందుకు వెళ్లాడనే విషయమై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. రాజు ఆచూకీని తెలిపి వెంటనే అతడిని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరారు. రాజుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. రాజు కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
గతంలో కూడా గల్ఫ్ కు తీసుకెళ్లిన ఏజంట్ల మోసాలతో పలువురు మోసపోయిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్లి జైలులో మగ్గిన ఉదంతాలున్నాయి. అయితే ఈ తరహా మోసాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్లేవారికి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది.