లగడపాటి సర్వే అనుకూలమే, కానీ పొంగిపోము: రావుల

Published : Dec 08, 2018, 03:00 PM IST
లగడపాటి సర్వే అనుకూలమే, కానీ పొంగిపోము: రావుల

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వేను నమ్మెచ్చు అని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. లగడపాటి సర్వే తమకు అనుకూలంగా రావడంతో పొంగిపోవడం లేదని చెప్పుకొచ్చారు.   

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వేను నమ్మెచ్చు అని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. లగడపాటి సర్వే తమకు అనుకూలంగా రావడంతో పొంగిపోవడం లేదని చెప్పుకొచ్చారు. 

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మిడిల్‌ డ్రాప్‌ అయ్యారని రావుల ఆరోపించారు. పక్కా ప్రణాళికతో ఎన్నికలు జరగలేదని, ఎన్నికల నిర్వహణకు ఈసీకి సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఈసీకి వనరులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఓట్లు, సీట్ల కోసం టీడీపీ పనిచేయదని, ప్రజల కోసమే పనిచేస్తుందని రావుల స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో తమ జెండా ఎగిరిందని తెలిపారు. గెలిచే స్థానాల్లోనే పోటీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు ప్రజాస్వామ్య పరిరక్షణే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఎల్లుండి బీజేపీయేతర పక్షాలతో చంద్రబాబు సమావేశమవుతారని, టీఆర్ఎస్ నుంచి మంచి ప్రతిపక్ష నాయకుడు రాబోతున్నారని రావుల చంద్రశేఖర్‌రెడ్డి జోస్యం చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?