తెరపైకి హరికృష్ణకుమార్తె సుహాసిని: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ప్రచారం

By Nagaraju penumalaFirst Published Oct 17, 2019, 4:03 PM IST
Highlights

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయిని గెలిపించి మరోసారి ఆదరించాలని సుహాసిని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. 

సూర్యాపేట: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి అనంతరం మరోసారి తెరపైకి వచ్చారు తెలుగుదేశం పార్టీ నేత, దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయికి మద్దతుగా పర్యటించారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయిని గెలిపించాలని ఆమె కోరారు. నల్గొండ జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని సుహాసిని చెప్పుకొచ్చారు. 

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాము అంతా ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారని గుర్తు చేశారు. 

దివంగత సీఎం నందమూరి తారకరామారావు సైతం నల్గొండ జిల్లా నుంచే పోటీ చేసిన విషయాన్ని సుహాసిని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీన్ని, తమ కుటుంబాన్ని నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నోసార్లు ఆదరించారని చెప్పుకొచ్చారు.

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయిని గెలిపించి మరోసారి ఆదరించాలని సుహాసిని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. 

ఇకపోతే ఈనెల 21న హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగనుంది. ఈనెల 24న ఉపఎన్నికల ఫలితం వెలువడనుంది. ఈ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోట రామారావుతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి సైదిరెడ్డిపై విజయం సాధించారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభకు పోటీ చేసి ఘన విజయం సాధించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

అటు ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా, సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజూర్ నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.
 

click me!