హీరో కృష్ణ కుటుంబ సభ్యులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ పరామర్శించారు.కృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
హైదరాబాద్:తాను ప్రజా ఉద్యమాల్లోకి రావడానికి హీరో కృష్ణ సినిమా కారణమని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.హైద్రాబాద్ నానక్ రామ్ గూడలోని నివాసంలో కృష్ణ పార్థీవ దేహనికి వెంకయ్యనాయుడు పూలమాలలువేసి నివాళులర్పించారు.హీరో మహేష్ బాబు సహా కుటుంబసభ్యలను వెంకయ్యనాయుడు ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను విద్యార్థిగా ఉన్న సమయంలో హీరో కృష్ణనటించిన అవే కళ్లు సినిమా విడుదలైన సమయంలో చోటు చేసుకున్న ఘటనను వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కు వెళ్లిన ఒక విద్యార్ధిని థియేటర్ యజమాని ఏదో అనడంతో విద్యార్ధులంతా ఉద్యమం చేసిన విషయాన్నివెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి తాను ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం ప్రారంభమైందన్నారు. ఇందుకు హీరో కృష్ణ సినిమా పరోక్షంగా కారణమైందని ఆయన వివరించారు. కృష్ణ సినిమాలు అప్పుడప్పుడూ చూస్తుంటానని చెప్పారు.అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరో కృష్ణ అద్భుతంగా నటించారని ఆయన గుర్తు చేసుకున్నారు.కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గుండెపోటు రావడంతో హీరో కృష్ణను నిన్న తెల్లవారుజామున కుటుంబసభ్యులు హైద్రాబాద్ కాాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.గుండెపోటు కారణంగా శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు చెప్పారు. ఇవాళ ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రి నుండి కృష్ణ పార్థీవదేహన్ని కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.