షర్మిల రాజకీయ నాటకాలు మానుకోవాలి.. తమ్మినేని వీరభద్రం సీరియస్..

By SumaBala Bukka  |  First Published Apr 4, 2023, 1:20 PM IST

షర్మిలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమేనని.. కానీ షర్మిల రాజకీయ నాటకాలు మానేయాలని అన్నారు. తాము అనేక సమస్యల మీద కలిసి పోరాడదామని పిలిచినా రాలేదని చెప్పుకొచ్చారు. 


హైదరాబాద్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ఆర్ టీపి అధినేత్రి షర్మిలపై మండిపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దామని షర్మిల తనకు కూడా ఫోన్ చేసిందని.. అది వాస్తవమేనని అన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి తాము కూడా సిద్ధమే అని చెప్పుకొచ్చారు. కానీ షర్మిలకు ఆదాని, మోడీల దోపిడీ ఎందుకు గుర్తుకు రావడం లేదని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మైనారిటీల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. కానీ, వీటి మీద ఆమెకు నోట మాటరావడం లేదు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యవహారం జగుస్సాకరంగా ఉంది.. అంటూ నిప్పులు కురిపించారు.

వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఇలాంటి రాజకీయ నాటకాలను మానుకోవాలని హితవు పలికారు. ఉద్యమాల్లో కలిసి రమ్మని ఎన్నోసార్లు మేము పిలిచాం.. కానీ ఆమె ఒక్క రోజు కూడా రాలేదు. ఇప్పుడు లిసి పని చేద్దాం అంటూ  ఫోన్ చేశారంటూ మండిపడ్డారు.  అంతేకాదు సిపిఎం, సిపిఐ కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. సిపిఐ, సిపిఎం ఉమ్మడి సభ ఏప్రిల్ 9వ తేదీన ఉంటుందని చెప్పారు. సీట్ల విషయంలో కూడా మరీ పట్టు పట్టకుండా సర్దుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

Latest Videos

జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం.. : ఏప్రిల్ 10న అఖిలపక్ష సమావేశానికి షర్మిల పిలుపు

ఇలా సిపిఐ, సిపిఎం ఉమ్మడి సభ పెట్టడం లెఫ్ట్ పార్టీల చరిత్రలోనే ఇది మొదటిసారి అని తమ్మినేని వీరభద్రం అన్నారు.  ఈ క్రమంలోనే బిజెపిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తప్పుడు పద్ధతిలో ఎదగాలని బిజెపి చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం ఓ కుట్ర అని అన్నారు. తాము ఎన్నికల్లో ఐక్యంగా ఉండాలని, ఐక్యత ప్రదర్శించాలని ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. 

రాహుల్ గాంధీపై చేపట్టిన ఇలాంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సిబిఐ మీద మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు చేస్తున్నవ్యాఖ్యలకు పొంతనలేదని  విమర్శించారు. ప్రస్తుతం సీబీఐ నిజాయితీగల సంస్థ అని మోడీ అన్నారు…ఇదే మోడీ గతంలో సిబిఐ కాంగ్రెస్ చెప్పినట్లుగా వింటుందని అన్నారు. అమిత్ షా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని చెప్పుకొచ్చారు. అప్పట్లో సిబిఐ నన్ను అప్రూవర్ గా మారమని చెప్పిందని ప్రకటించిన అమిత్ షా.. ఇప్పుడు సిబిఐ గొప్పది అంటున్నారని అన్నారు. 

కెసిఆర్ మీద, బీఆర్ఎస్ మీద బిజెపి వేధింపులు మానుకోవాలని.. కక్ష సాధింపు కేసులు మానుకోవాలని చెప్పుకొచ్చారు. నిజంగానే కవిత తప్పు చేస్తే శిక్షించాలి అన్నారు. తెలంగాణలో పరీక్ష పత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చనే లేదన్నారు.

click me!