కాంగ్రెస్‌లో నిజమైన హీరోలు కార్యకర్తలే.. 50 లక్షల సభ్యత్వాలే టార్గెట్: రేవంత్ రెడ్డి

Published : Mar 05, 2022, 04:59 PM IST
కాంగ్రెస్‌లో నిజమైన హీరోలు కార్యకర్తలే.. 50 లక్షల సభ్యత్వాలే టార్గెట్: రేవంత్ రెడ్డి

సారాంశం

కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేది కార్యకర్తలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గౌరవం ఉంటుందన్నారు. అన్ని బూతులలో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేది కార్యకర్తలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గౌరవం ఉంటుందన్నారు. అన్ని బూతులలో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. ప్రతి బూత్‌లో కనీసం 100 సభ్యత్వాలు చేయాలన్నారు. మేడ్చల్‌ నియోజక వర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే శనివారం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 

ఒక్క సభ్యత్వ నమోదును తక్కువ చేసినా కార్యకర్తలు చేసిన కృషి నీర్చుగార్చినట్టేనని అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా డిజిటల్ సభ్యత నమోదు చేపట్టాలని అన్నారు. సభ్యత్వ నమోదులో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వాలు 40 లక్షలకు చేరుకున్నాయని తెలిపారు. 30 లక్షల సభ్యత్వం చేస్తానని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పానని అన్నారు. కానీ పార్టీలోని అందరి కృషితో ఇప్పటికే 40 లక్షల సభ్యత్వాలు నమోదు అయ్యాయని చెప్పారు. 

50 లక్షల క్రియాశీలక సభ్యతాలు నమోదు చేయించి.. సోనియా గాంధీకి మన తెలంగాణ మద్దతును తెలుపుదామని చెప్పారు. కార్యకర్తలను సన్మానించుకోవాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకన్నట్టుగా చెప్పారు. 80 లక్షలు ఓట్లు తీసుకొస్తే.. 90 సీట్లు గెలుపొంది తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తీసుకొద్దామని చెప్పారు. 40 లక్షల మంది అదనంగా ఒక్కో ఓటు తీసుకువచ్చినా చాలు 80 లక్షల ఓట్లు లభిస్తాయని ధీమాగా చెప్పారు. పని చేసిన కార్యకర్తలను అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌లో నిజమైన హీరోలు కార్యకర్తలేనని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu