మంత్రి తలసాని కారుకు యాక్సిడెంట్ (2 వీడియోలు)

Published : Oct 11, 2017, 01:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మంత్రి తలసాని కారుకు యాక్సిడెంట్ (2 వీడియోలు)

సారాంశం

కీసర వద్ద ప్రమాదానికి గురైన మంత్రి తలసాని కారు మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం ప్రమాదంలో గాయపడిన మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసి వస్తుండగా ప్రమాదం

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రోడ్డు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన కీసర సమీపంలో ఔట్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది.

 

మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో మండలంలోని అంతయిపల్లి గ్రామంలో నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేసి కీసర వస్తుండగా ఔటర్ మీద ప్రమాదం జరిగింది. తలసాని ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలసానికి ఏమీ కాలేదు కానీ ఆయనతోపాటు అదే కారులో వస్తున్న మెడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్పంగా గాయాలయ్యాయి.

 

ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Medaram Travel Guide : సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళుతున్నారా..? ఈ టూరిస్ట్ స్పాట్స్ కూడా చుట్టిరండి
Harish Rao: హ‌రీశ్‌రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారా.? ఏడున్న‌ర గంట‌ల విచార‌ణ‌లో ఏం తేలిందంటే