సెకండ్ వేవ్ డేంజర్, నాలుగు వారాలు కీలకం: తెలంగాణ హైల్త్ డైరెక్టర్

By narsimha lodeFirst Published Apr 7, 2021, 5:51 PM IST
Highlights

తెలంగాణలో  కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్  శ్రీనివాసరావు హెచ్చరించారు.


హైదరాబాద్: తెలంగాణలో  కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్  శ్రీనివాసరావు హెచ్చరించారు.గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ డేంజర్ గా  ఉందని ఆయన చెప్పారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని ఆయన చెప్పారు. ఈ నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆసుపత్రుల్్లో  బెడ్స్ కూడ దొరకకపోయే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.  రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కూడ  సాధారణ వైద్య చికిత్సలతో పాటు కరోనా చికిత్సలు కూడ నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
 

click me!