నేడు హైదరాబాద్‌లో టి-వర్క్స్‌ ఆవిష్కరణ.. దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్..

Published : Mar 02, 2023, 08:51 AM IST
నేడు హైదరాబాద్‌లో టి-వర్క్స్‌ ఆవిష్కరణ.. దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్..

సారాంశం

దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టి వర్క్స్ నేటినుంచి హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది. నేడు ఫాక్స్‌కాన్ చైర్మన్ దీన్ని ఆవిష్కరించనున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, 78,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన T-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు గురువారం ఆవిష్కరించనున్నారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రోటోటైపింగ్ సదుపాయం ఉన్న  T-వర్క్స్‌. హైదరాబాద్‌లోని IT హబ్ నడిబొడ్డున ఉన్న.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌ ఇది. దీన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ మేకర్స్ ల్యాబ్‌ను వచ్చే రెండు, మూడేళ్లలో 2.5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం తెలిపారు. 2023 చివరి నాటికి 110 కోట్ల పెట్టుబడితో అవసరమైన యంత్రాలను ఇందులో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రోటోటైపింగ్ సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉండనుంది.

టి-వర్క్స్‌లో 15 కోట్ల విలువైన యంత్రాలను ఏర్పాటు చేశారు. 110 కోట్ల పెట్టుబడిలో పరిశ్రమలు 40 కోట్ల విలువైన యంత్రాలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. టి-వర్క్స్ వినూత్న ఐడియాతో వచ్చే ఎవరికైనా సహాయపడుతుందని.. ఇక్కడ ఉత్పత్తి రూపకల్పన, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, మెటీరియల్స్ సోర్సింగ్ వంటి వాటిపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.

ఎంట్రీ అడ్డంకులను తగ్గించి, జనాల్లో డిజైన్ ఆలోచనను పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ మోడల్ లో ప్రతి వినియోగానికి సబ్సిడీతో కూడిన చెల్లింపు విధానంగా ఉంటుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తున్న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, నిజామాబాద్ వంటి పట్టణాల్లో కూడా టీ-వర్క్స్ శాటిలైట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఇది అని ఇందులో వేల స్టార్టప్ లో పనిచేస్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు టీ వర్క్స్ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్లలో శాటిలైట్ సెంటర్స్ పెడతామని కూడా ప్రకటించారు. ఫీవర్కు స్కూలు విద్యార్థులను కూడా తీసుకువచ్చి ఇక్కడ జరుగుతున్నది చూపించడం ద్వారా వారిలో భవిష్యత్తులో ఇటువైపు ఆలోచించేలా చేయవచ్చని తెలిపారు. 

వినూత్న ఆలోచనలతో ఔత్సాహిక యువకులు ఎవరు ముందుకు వచ్చిన టి వర్క్స్ బాగా ఉపయోగపడుతుందని,  సపోర్ట్ దొరుకుతుందని స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు | Asianet Telugu
Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు| Asianet News Telugu