హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

Published : Oct 21, 2018, 01:39 PM IST
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

సారాంశం

 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విచ్చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాకూటమిలో పొత్తు, సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విచ్చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాకూటమిలో పొత్తు, సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 

మరోవైపు ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా కొలిక్కిరాకపోవడంతో టీ టీడీపీ నేతలు చంద్రబాబుతో చర్చించనున్నారు. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయాలు, టీడీపీ నేతల మనోభవాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నారు టీ టీడీపీ నేతలు. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu