టీఆర్ఎస్ కు త్వరలో భారీ షాక్:ఉత్తమ్

By Nagaraju TFirst Published Oct 12, 2018, 8:10 PM IST
Highlights

త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలడం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది పెద్ద నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారంతా కాంగ్రెస్‌ కండువా కప్పుకుని టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తారన్నారు. ప్రస్తుత సర్వే ప్రకారం మహాకూమి 80 స్థానాల్లో గెలవబోతుందని, టీఆర్ఎస్ 20 సీట్లకే పరిమితం కాబోతుందని చెప్పారు. 


హైదరాబాద్: త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలడం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది పెద్ద నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారంతా కాంగ్రెస్‌ కండువా కప్పుకుని టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తారన్నారు. ప్రస్తుత సర్వే ప్రకారం మహాకూమి 80 స్థానాల్లో గెలవబోతుందని, టీఆర్ఎస్ 20 సీట్లకే పరిమితం కాబోతుందని చెప్పారు. 

మరోవైపు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచుతామని తెలిపారు. పది నియోజకవర్గాలకు ఒక బహిరంగ సభ నిర్వహిస్తామని ఉత్తమ్ చెప్పారు. 10 బహిరంగ సభల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 3 బహిరంగ సభల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పాల్గొంటారని తెలిపారు. సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం చేస్తామన్నారు. మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో ముసాయిదా ఇప్పటికే రెడీ అయిందన్నారు. అయితే సీట్ల సర్దుబాటే ఇంకా ఫైనల్ కాలేదన్నారు.
 
సీట్ల సర్దుబాటుపై ఆశావాహులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్నది పార్టీ హైకమాండ్ పరిశీలనలో ఉందన్నారు. గెలిచే అవకాశం, సామాజిక న్యాయం ప్రకారం టికెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాలపై రివ్వ్యూ చేశామని, కోదండరాం తో చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. 

మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని అంతా మంచి వాతావరణంలో ఉన్నామన్నారు ఉత్తమ్. సీట్ల సర్ధుబాటుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. మహాకూటమి పేరు మారుస్తామన్నారు. మాహకూటమి నేతలంతా ఉమ్మడి ప్రచారం చేసి టీఆర్ఎస్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు ఆశల పల్లకిలో తేలుతున్నారని, ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఉత్తమ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో అమిత్ షా టూర్ ఓ డ్రామా అంటూ విమర్శించారు. అమిత్ షా, కేసీఆర్‌ కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తున్న కేసీఆర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. 

click me!