యూపీఏ కోసం చంద్రబాబు, కేసీఆర్ ఒక్కటయ్యే ఛాన్స్ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published May 7, 2019, 3:53 PM IST
Highlights

కేంద్రంలో రాబోయేది యూపీఏ ఫ్రంట్ అని చెప్పుకొచ్చారు. యూపీఏ ఏర్పాటులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఉప్పు నిప్పులా ఉన్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరు ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలు పర్యటిస్తుంటే మరోకరు బీజేపీయేతర ఫ్రంట్ కోసం కూటమి కడుతున్నారు. 

ఇలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ఇరువురు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇలాంటి తరుణంలో వారి కలయికపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేంద్రంలో రాబోయేది యూపీఏ ఫ్రంట్ అని చెప్పుకొచ్చారు. యూపీఏ ఏర్పాటులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. 

ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎవరికీ అంతుపట్టని జగ్గారెడ్డి వ్యాఖ్యలపై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 
 

click me!