
రక్షకుడే భక్షకుడయ్యాడు. ఎవరైనా తుంటరి కుర్రాలు ఆడపిల్లలను ఏడిపించడం.. అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తే... బుద్ధి చెప్పాల్సిన కానిస్టేబులే.. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తాండాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ దయానంద్ స్థానిక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ ప్రవర్తనతో తండావాసులు ఆందోళన చేపట్టారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దయానంద్‌పై చర్యలకు అధికారులు ఆదేశించారు. అతనిపై వేటు పడే అవకాశం ఉంది.