ప్రతిపక్షంగా మీ పని చెయ్యండి, నేను సేఫ్ గార్డ్ గా ఉంటా: టీ కాంగ్రెస్ నేతలతో గవర్నర్ తమిళసై

By Nagaraju penumalaFirst Published Sep 17, 2019, 6:23 PM IST
Highlights

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సౌందరరాజన్. ప్రతిపక్ష నాయకులుగా మీ పని మీరు చేయాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు తాను సేఫ్ గార్డుగా ఉంటానని హామీ ఇచ్చారు. 
 

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మంత్రిగా ఆనాటి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారని ఆనాటి నుంచి ఫిరాయింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. 

2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారని వారిలో కొందరు మంత్రులు, కీలక పదవుల్లో ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. 

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సౌందరరాజన్. ప్రతిపక్ష నాయకులుగా మీ పని మీరు చేయాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు తాను సేఫ్ గార్డుగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా గవర్నర్ సౌందర రాజన్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించే అంశంపై చర్చించారు. ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు గవర్నర్ ప్రకటించారు. దాంతో రాజభవన్ లో నిర్వహించే ప్రజా దర్బార్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు హామీ ఇచ్చారు. ఇకపోతే తమిళసై సౌందర రాజన్ ను కలిసిన వారిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దిద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క ఉన్నారు.   

click me!