బీజేపీ చరిత్ర వక్రీకరిస్తోంది, రామ్ మాధవ్ ది వికారమైన స్టేట్మెంట్: విమోచన దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Sep 17, 2019, 12:08 PM IST
Highlights

కాంగ్రెస్, కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. నిజాం అరాచకాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు  భారత దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ కు సెప్టెంబర్ 17 1948లో వచ్చిందని స్పష్టం చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్  కుమార్ రెడ్డి.  హైదరాబాద్ విలీన దినోత్సవానికి పోరాటం చేసిన వీరుల త్యాగాలను కొనియాడారు ఉత్తమ్. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను ఉత్తమ్ సన్మానించారు. 

కాంగ్రెస్, కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. నిజాం అరాచకాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు  భారత దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ కు సెప్టెంబర్ 17 1948లో వచ్చిందని స్పష్టం చేశారు. 
 
ఖాశీంరజ్వీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందని స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ చొరవతో భారత్‌లో హైదరాబాద్‌ విలీనమైందని గుర్తు చేశారు. అయితే ఈ పోరాటానికి బీజేపీ మతం రంగు పూసే ప్రయత్నం చేసిందన్నారు. హైదరాబాద్‌ విలీనానికి మతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 

చరిత్ర తెలియని రాంమాధవ్ వక్రీకరించి మాట్లాడుతున్నారంటూ ఉత్తమ్ ధ్వజమెత్తారు. రామ్ మాధవ్ వికృతమైన స్టేట్మెంట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. అతను ఆంధ్రా కావడంతో తెలంగాణ సమాజం గురించి తెలియదన్నారు. 

ఆనాటి ప్రధాని నెహ్రూ, ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి కారణంగానే  హైదరాబాద్ విలీనం జరిగిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విలీనం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కృషి ఎంతో ఉందని చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 
 

click me!