మోడీతో భేటీ.. పక్కన ఎంపీలు ఎందుకు లేరు: కేసీఆర్‌పై పొన్నాల ప్రశ్నలు

By Siva KodatiFirst Published Dec 13, 2020, 9:56 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో యుద్ధం చేస్తానన్న కేసీఆర్‌.. ప్రధాని కాళ్లపై పడ్డారని, మోడీని కలిసే సమయంలో కేసీఆర్‌ వెంట ఎంపీలు, అధికారులు లేరని ధ్వజమెత్తారు. అసలు ఆగమేఘాల మీద కేసీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అని పొన్నాల ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని లక్ష్మయ్య విమర్శించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ఢిల్లీకి వెళ్లారనడం నాటకమని ఆయన అభివర్ణించారు.

డీపీఆర్ సమర్పించకుండా జాతీయహోదా వస్తుందా? అని పొన్నాల ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం హామీలపై మోడీని ఎందుకు నిలదీయడం లేదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 

click me!