కేసీఆర్ గారూ.. విమానాశ్రయాలు కాదు, రోడ్డు కావాలి : జీవన్ రెడ్డి

By Siva KodatiFirst Published Dec 13, 2020, 6:44 PM IST
Highlights

తెలంగాణ ప్రజలకు కావాల్సింది విమానాశ్రయాలు కాదని సౌకర్యవంతమైన రోడ్లన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి గురించి కాకుండా విమానాశ్రయాలపై కేసీఆర్‌ ప్రస్తావించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు ఉండేలా రహదారులు నిర్మిస్తే సరిపోతుందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిగిన తరువాత ఎలా జాతీయ హోదా అడుగుతారని ఆయన నిలదీశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు జరిగిన నష్టాన్ని గుర్తించిన కేసీఆర్‌.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే విమానాశ్రయాల రాగం ఎత్తుకున్నారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నందునే వరద బాధితులకు రూ.10వేలు పరిహారం ఇచ్చారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం లేదని.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చుకున్నారని.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం నిరాశే మిగిల్చారని ఆయన దుయ్యబట్టారు.  

click me!