సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.మృతులందరూ పాతికేళ్ల లోపు వారే.
సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యారడైజ్ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ స్వప్నలోక్ కాంప్లెక్స్ మంటల్లో చిక్కుకుంది. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో ఆరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదమే మిగిలింది. మృతులందరూ పాతికేళ్ల లోపు వారే.
ఎనిమిది అంతస్తుల ఈ భవనంలో తొలుత ఏడో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అలా మొదలైన మంటలు క్రమక్రమంగా బిల్డింగ్ లోని మిగతా అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన పైర్ ఇంజన్స్‌తో అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు మొత్తం డజన్‌కి పైగా ఫైర్ ఇంజన్స్‌ని ఉపయోగించారు..
undefined
ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతోపాటు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి. నిత్యం రద్దీగా ఉంటే ఈ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. వివిధ మార్గాల్లో బయటకు పరుగులు దిశారు. మంటలు క్రమంలో వ్యాప్తి చెందడంతో పొగ, అగ్నికీలలతో పెయింట్ డబ్బాల లాంటివి పేలడంతో కొందరు కిందికి రాలేకపోయారు.
మంటల్లో దాదాపు 15 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిని అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో కాపాడారు. వీరిలో ఆరుగురిని అపస్మారక స్థితిలో బయటికి తీసుకొచ్చారు. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. కానీ.. వారిని వైద్యులు కాపాడలేకపోయారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రిలో ప్రమీల (22),వెన్నెల(22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22)లు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే సమయంలో అపోలో ఆసుపత్రిలో ప్రశాంత్ (23) కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.
వీరిలో వెన్నెల (మర్రిపల్లి), శివ (నర్సంపేట), శ్రావణి (నర్సంపేట) వరంగల్ జిల్లాకు చెందిన వారు. అలాగే.. ప్రశాంత్ (కేసముద్రం), ప్రమీల (సురేష్‌నగర్) మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు.త్రివేణి ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవ వారు. వీరంతా బీఎం5 కార్యాలయంలోని కాల్‌సెంటర్‌లోఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో శ్రావణ్, భారతమ్మ, సుధీర్‌రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య, రవిలను అగ్నిమాపక సిబ్బంది రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. వీరంతా దాదాపు 4 గంటలపాటు పొగలో చిక్కుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.