
శేరిలింగంపల్లి : చందానగర్ పరిధిలో ఓ BTech student అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ కాస్ట్రో, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లి దూబే కాలనీకి చెందిన వెంకటాచారి హెచ్సీయూలో కార్పెంటర్. corona virus తో సంవత్సరంన్నర క్రితం మృతి చెందాడు. అతనికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి అయి మొయినాబాద్ లో ఉంటుంది.
చిన్న కుమార్తె సౌజన్య (22) బాచుపల్లి డిఆర్ కే కళాశాలలో BTech third year చదువుతోంది. ఈ నెల 18న పెద్ద కుమార్తె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి మొయినాబాద్ కి వెళ్ళింది. సౌజన్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. కాసేపయ్యాక సౌజన్య పిచ్చిపిచ్చిగా అరుస్తోంది... డాక్టర్ ను పిలుచుకుని వస్తాను.. అని ఇంటిపైన అద్దెకు ఉన్న వారితో చెప్పి వెళ్లిపోయాడు. వారు వెళ్లి చూడగా సౌజన్య కింద పడి ఉంది. వెంటనే వైద్యుడిని తీసుకువచ్చి పరీక్ష చేపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే వారు ఈ విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతని పైనే అనుమానం…
సౌజన్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది విజయ్ అని సిసి కెమెరాల పరిశీలనలో స్పష్టమైంది. అతడు స్థానికంగా జీటీజీ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. 8 నెలల ముందు సౌజన్య అక్కడ ఉద్యోగం చేసింది. కళాశాలకు వెళ్లాలని ఉద్యోగం మానేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సౌజన్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘సాయంత్రం ఇంట్లోకి విజయ్ రెండు సార్లు వచ్చి వెళ్ళాడు. ఉరేసుకున్నట్లు చిత్రీకరించడానికి చీరను కత్తితో కత్తిరించినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలో కూడా ఆమెను వేధించాడు ఇది ముమ్మాటికీ హత్యే. ఘటన జరిగాక విజయ్ స్థానికంగానే తిరుగుతున్నాడు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. మాపైనే దురుసుగా మాట్లాడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ ఇంటికి తాళం ఉంది అని అతనిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చెప్పారు.
ఇదిలా ఉండగా, marriage చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా... అంటూ యువతి బంధువులు ఎదుటే.. ప్రియుడికి బడిత పూజ చేసింది. వివరాల్లోకి వెళితే.. కల్లూరు మండలం చిన్నటేకూరుకి చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా love affair నడుస్తోంది.
తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా.. కుటుంబ సభ్యులు వద్దంటున్నారు అని శేఖర్ బదులిచ్చాడు. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీస్స్టేషన్లో పంచాయతీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరింది. కానీ శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుని తెలంగాణలోని బంధువులు ఊరికి తీసుకువెళ్ళింది.
ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కోరింది. ప్రియుడు నిరాకరించడంతో అక్కడే ఉన్న కర్రతో చితకబాదింది. ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో... వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా... సదరు యువతి ప్రేమ విషయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటనపై పోలీసుల వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.