
మేళ్లచెర్వు: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండలకేంద్రంలో మంగళవారం నాడు రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వసూళ్ల విషయంలో రెండు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. జోజి అనే వ్యక్తిపై సూర్య దాడికి దిగాడు. జోజికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. జోజి, సూర్యలపై పలు కేసులున్నాయి. నడిరోడ్డుపై ఇరు వర్గాలు కర్రలతో దాడులు చోటు చేసుకోవడంతో భయాందోళనలకు గురయ్యారు.జోజిపై దాడి చేసిన తర్వాత సూర్య పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.