కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా..

By SumaBala Bukka  |  First Published Sep 15, 2023, 1:34 PM IST

కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. దీంతో కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ వాదిస్తోంది.


హైదరాబాద్ : కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ విచారణ తీరును తప్పుపడుతూ గతంలో కవిత పిటిషన్ వేశారు. లిక్కర్ కేసులో తనకు ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత కోరారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని కోరారు. 

సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో కవితకు కాస్త ఊరట లభించినట్లేనని తెలుస్తోంది. ఈడీ తదుపరి నోటీసులు జారీ చేస్తుందా?  తప్పనిసరి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది. సుప్రీంలో విచారణలో ఉన్న క్రమంలో ఈడీ గురువారం నోటీసులు జారీ చేయడంతో ఈడీ అధికారులను సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్ వేశారు.

Latest Videos

ఈడీ నోటీసులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన కవిత

సుప్రీంలో వాదనల సందర్భంగా కవిత విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ వాదించింది. ఈ రోజే ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటిసులు ఇచ్చిన ఈ నేపథ్యంలో కవిత ఇప్పుడు ఏం చేయనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, రెండు, మూడు రోజుల సమయం తీసుకుని హాజరవుతారా? ఇంకేదైనా వాయిదా కొరతారా? అనేది తన లాయర్లతో మాట్లాడిన తరువాత తెలియనుంది. 

click me!