సెప్టెంబర్ 17 వరకు వరవరరావు గృహనిర్భంధంలోనే...

By Arun Kumar PFirst Published Sep 12, 2018, 4:30 PM IST
Highlights

బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన పౌర హక్కుల నేతలకు సుప్రీం కోర్టు మరోసారి ఊరట కల్పించింది. విరసం నేత వరవరరావుతో పాటు మరో నలుగురిని పూణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిని అరెస్టు చేయడం కాకుండా గృహనిర్భంధం మాత్రమే విధించాలని కోర్టు పోలీసులకు ఆదేశించింది. దీంతో ఈ ఐదుగరు పౌరహక్కుల నేతలు జైలు నుండి విడుదలైన్పటికి గృహనిర్భంధాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే వీరి గృహనిర్భందం గడువును పొడిగిస్తూ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 17 వరకు వీరి గృహనిర్భంధాన్ని పొడిగించారు. 
 
భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వరవరరావుతో పాటు వెర్నాన్ గొంజాలెజ్, అరుణ్ ఫెరీరా, సుదా భరద్వాజ్, గౌతమ్ నవలఖాలను పూణె పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. అయితే వీరి అరెస్టును సవాల్ చేస్తూ పలువురు పౌరహక్కుల నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వీరికి అరెస్ట్ నుండి మినహాయింపునిస్తూ సెప్టెంబర్ 6వ తేదీ వరకు గృహనిర్భంధం మాత్రమే విధించాలని పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత గడువును ఈ నెల 12 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి సెప్టెంబర్ 17కు గడువు పొడిగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు.. ఐపీఎస్‌పై సుప్రీం కన్నెర్ర

ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

వరవరరావు అరెస్ట్.... ట్యాంక్ బండ్ పై ప్రజాసంఘాల నిరసన

40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

click me!