యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొన్న సీజేఐ ఎన్వీరమణ

By narsimha lodeFirst Published Jun 15, 2021, 9:19 AM IST
Highlights

యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం నాడు దర్శించుకొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్వీరమణ యాదాద్రిలో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి వచ్చారు. 

యాదగిరిగుట్ట:  యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం నాడు దర్శించుకొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్వీరమణ యాదాద్రిలో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి వచ్చారు. 

"

కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి ఆలయానికి వచ్చిన సీజేఐ దంపతులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు,  అర్చకులు స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మినర్సింహ్మాస్వావి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఆలయా నిర్మాణ పనులను సీజేఐ పరిశీలిస్తారు.  సుమారు మూడు గంటలపాటు ఎన్వీరమన ఆలయంలో గడుపుతారు. గత వారంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకొన్నారు. 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత వారంలో ఆయన  తొలిసారిగా తిరుమలకు వచ్చారు. తిరమలేశుడిని దర్శించుకొన్న తర్వాత తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని దర్శనం చేసుకొన్నారు. 

click me!