మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ.. దారుణ హత్య

Published : Jun 15, 2021, 08:24 AM ISTUpdated : Jun 15, 2021, 10:16 AM IST
మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ.. దారుణ హత్య

సారాంశం

స్థానికంగా డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తూ  జీవనం సాగిస్తున్నాడు. కాగా.. ఫరీద్ కి ఆట్ డ్రైవర్ మహబూబ్ తో స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు మద్యం సేవించేవారు.

మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవ పడి.. చివరకు ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని హోలికేడ్ గ్రామానికి  చెందిన ఫరీద్(44) బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. హపీజ్ పేట ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.

స్థానికంగా డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తూ  జీవనం సాగిస్తున్నాడు. కాగా.. ఫరీద్ కి ఆట్ డ్రైవర్ మహబూబ్ తో స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు మద్యం సేవించేవారు. కాగా.. సోమవారం రాత్రి కూడా వీరిద్దరూ కలిసి మద్యం సేవించాలని ప్లాన్ వేసుకున్నారు.

సోమవారం రాత్రి ఫరీద్, మహబూబ్ మద్యం తాగేందుకు ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వారు తెచ్చుకున్న మద్యం అయిపోవడంతో.. మళ్లీ వెళ్లి కల్లు తెచ్చుకోవాలని అనుకున్నారు. ఇద్దరిలో ఎవరు వెళ్లి తేవాలి అనే విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త పెద్దదై ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో.. ఆవేశానికి గురైన మహబూబ్.. రాయితో ఫరీద్ తల పగలగొట్టాడు. దీంతో.. ఫరీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే